ప్రకాశం: వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వేరే ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇంటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకొని మొబైల్ ఫోన్లలో వాచ్ చేయాలన్నారు. లేకుంటే పోలీసుల లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలన్నారు.