KRNL: డీఈఓ శ్యామ్యూల్ పాల్ ఆదేశాల మేరకు పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో ఈ నెల 7న పీటీఎం సమావేశం నిర్వహించాలని ఎంఈఓ-2 రామమూర్తి మంగళవారం తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు.