SKLM: భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. దశాబ్దాలుగా నలుగుతున్న వంశధార జల వివాదంలో రాష్ట్రానికి.. ముఖ్యంగా జిల్లా రైతాంగానికి భారీ ఊరట లభించింది. వంశధార నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పును అమలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత నెల 30న తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.