NTR: ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం జగన్మాతకు కనకాంబరాలు, గులాబీలతో ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. పూలతో అలంకరించిన అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.