కృష్ణా: పేద విద్యార్థులు ప్రతిభతో ఎదగాలని జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అన్నారు. బుధవారం చల్లపల్లి ఎస్.ఆర్.వై.ఎస్.పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయులు మండవ శేషగిరిరావు పేద విద్యార్థులకు సగం ధరకే లాప్ టాప్స్ అందచేశారు. 9వ తరగతి విద్యార్థి పోతార్లంక ధనుష్, 8వ తరగతి విద్యార్థిని గంజాల అశ్వినిలకు ఈ లాప్ టాప్స్ అందచేశారు.