W.G: సంక్రాంతి పండుగ పేరుతో చట్ట విరుద్ధమైన కోడిపందేలు, జూదం, గుండాట వంటివి జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ ప్రతాప్ కోరారు. శుక్రవారం తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. జూద క్రీడలు కారణంగా పేద, మధ్యతరగతి యువత ఏడాదిలో సంపాదించిన డబ్బంతా కోల్పోతున్నారని అన్నారు.