NLR: ముత్తుకూరు జామియా మసీదులో ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బీసీ కాలనీలోని మసీదును సందర్శించారు. మదరసా భవన నిర్మాణానికి హామీ ఇచ్చారు.