GNTR: రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రజలు తమ సమస్యలను చెబుతూ.. పరిష్కారాన్ని కోరారు. మంత్రి సదరు సమస్యలను సమీక్షించి, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు.