NLR : జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలో వివిధ వస్తువుల సరఫరా చేయుటకు, లీజు హక్కులకు వేలం పాటలు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని ఏపీ టూరిజం అతిథి గృహంలో అధికారుల సమక్షంలో పాటలు నిర్వహిస్తామన్నారు. ఈ వేలం పాటలో పాల్గొన్నవారు ధరావత్తులు చెల్లించాలని పేర్కొన్నారు.