KRNL: గూడూరులోని కోటవీధికి చెందిన కుమ్మరి విష్ణు సాయి గేట్-2026 ఫలితాల్లో సత్తాచాటాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా ర్యాంక్ 399, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 429వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ విజయానికి తమ తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం ముఖ్య పాత్ర పోషించాయని విష్ణు సాయి తెలిపారు.