BPT: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో బాపట్ల చిల్ రోడ్డు సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమానత్వం, మహిళలు చేస్తున్నటువంటి శ్రమకు గుర్తింపు, మహిళలకు రక్షణ భద్రత ఉండడం కోసం పాటుపడాలన్నారు.