TPT: పాకాల మండలం కె. వడ్డేపల్లి పంచాయతీ అమ్మగారి పల్లిలో ఉన్న దొనకొండ గంగమ్మ తల్లి ఎంతో మహిమ గలిగిన దేవత అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి అన్నారు. ఆదివారం సుధా రెడ్డి అమ్మగారి పల్లికి చేరుకొని మహా కుంభాభిషేకంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన సుధా రెడ్డికి కూటమి పార్టీ నాయకులు, ఆలయ నిర్వహకులు స్వాగతం పలికారు.