ప్రకాశం: సీఎం చంద్రబాబు పర్యటన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, ప్రత్యేక జిల్లా ఏర్పాటు విషయంలో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించినా అధికారులు, పాలకులు అవకాశం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.