ATP: కళ్యాణదుర్గం మండలం మోరెపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు హనుమంతరాయుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆదివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.