ప్రకాశం: ఈ నెల 13 పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి తిరుణాళ్ళ సందర్భంగా.. కొండ మీదకు వెళ్లే రోడ్డు మార్గం రాళ్లు గుంతలతో దెబ్బతింది. పూర్తిగా దెబ్బ తినడంతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, జేసీబీతో రోడ్డు మరమ్మతులను చేయించారు. రెండు రోజుల నుంచి కొండ కింద నుంచి గుడి వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి.