NLR: ఏఎస్ పేట దర్గాలో హుండీల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు 2వ విడత పూర్తయ్యే సరికి రూ.1.96కోట్ల నగదు, 49 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి లెక్కించారు. దర్గాలోని మొత్తం 25 హుండీలు ఉన్నాయి. ఇప్పటికీ 11 హుండీల్లో లెక్కింపు పూర్తి చేశామని ఏవో హుసేని తెలిపారు.