GNTR: పెదనందిపాడు మండలంలోని పెదనందిపాడు, వరగాని సబ్స్టేషన్ల పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 33 కేవీ కొత్త లైన్ల ఏర్పాటు పనుల నిమిత్తం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఏఈ మురళీకృష్ణ తెలిపారు. ఈ పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.