కోనసీమ: అమలాపురం పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న CI పి. వీరబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలలో ఎక్కువ భాగం తలకు గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయని ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు.