ATP: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకుని సోమవారం అనంతపురం పట్టణంలో వేడుకలు జరిగాయి. ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఆయన విగ్రహానికి వైసీపీ ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఉయ్యాలవాడ సేవలను స్మరించుకున్నారు.