ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు గోకిరి రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. రాజేంద్రపాలెంకు చెందిన రామకృష్ణ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈవో రాంబాబు మంగళవారం పలువురు ఉపాధ్యాయులతో కలిసి పరామర్శించారు.