సత్యసాయి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పెనుకొండలోని నివాసంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యం సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం విని, రాశి ఫలాలను తెలుసుకున్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.