CTR: వరుస అత్యాచారాలు, హత్యాయత్నాలు, డ్రగ్స్ అక్రమ రవాణాలో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని గుడిపాల పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 3 న గుడిపాల మండలంలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన అలెక్స్పై కేసు నమోదు చేసి, ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇతనిపై 50కి పైగా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.