KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఉష్ణోగ్రతల పట్ల జాగ్రత్త వహించాలని డాక్టర్ శివకుమార్ తెలిపారు. సిద్ధవటం మండలం మాధవరం PHCలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీతారాముని కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు అధిక ఉష్ణోగ్రత దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, మజ్జిగ తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. వడదెబ్బ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.