NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఖాజా నగర్ లోని ఆస్థాన యె ఖాదిరియాలో మీలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గంధ మహోత్సవం నిర్వహించారు. గంధాన్ని గ్రామంలో మేళ తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించిన అనంతరం ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు గంధాన్ని పంచిపెట్టి ప్రసాదాలు అందజేశారు.