అన్నమయ్య: రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ గా చమర్తి జగన్మోహన్ రాజును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు TDP అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. కాగా, ఉమ్మడి కడప జిల్లా కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు స్వయంగా చమర్తిని ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పటికీ, నియామక ఉత్తర్వులు తాజాగా అందాయి.