VZM: రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా ఎరువులను సకాలంలో పంపిణీ చేయాలని చీపురుపల్లి డీడీవో హేమ సుందర్ అధికారులకు సూచించారు. బుధవారం చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన 25 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామన్నారు.