NLR: రాపూరు మండలం 7వ వార్డు సభ్యురాలు ఆరిఫా సోమవారం కాలువల శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ఆమె కార్మికులతో కలిసి కాలువలను శుభ్రం చేయించారు. అలాగే మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.