అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని లాస్య ప్రియ ఎన్సీసీలో సత్తా చాటారు. మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్: సీ. యువరాజ్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని దండేలి నందు వాటర్ రాఫ్టింగ్ పోటీలలో తమ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ లాస్య ప్రియ రాష్ట్రస్థాయిలో విజయం సాధించిందన్నారు. కల్నల్ మోహన్ నాయక్ ప్రశంసా పత్రాన్ని అందజేశారన్నారు.