ASR: ఈశాన్య రుతుపవనాల కారణంగా గిరిజన ప్రాంతంలో అరుదైన పంటలు సాగుచేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. వలిసెలు, స్ట్రాబెర్రీ, రాజ్ మా, తులిప్, జాజికాయ, జాపత్రి తదితర పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. చల్లని వాతావరణం అధిక దిగుబడులు ఇస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.