కోనసీమ: మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను సంబంధిత శాఖల అధికారులతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.