NLR: సోమశిల జలాశయ తాజా నీటి వివరాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడంలేదని జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. జలాశయంలో 54.479 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 330 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 400 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.