KRNL: పత్తికొండకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎంపీటీసీ దేవరగట్టు గణపతి ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఆయన రెండుసార్లు ఎంపీటీసీగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు, గ్రామస్థులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. స్థానికులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.