AKP: నక్కపల్లి మండలం చందనాడ వద్ద ఈనెల 23న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు.