NLR: ముత్తుకూరు(మం) బ్రహ్మదేవం పరిధిలోని బుడ్డి డ్రైన్ సమీపంలో ముత్తుకూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. పంటకాలువలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం చనిపోయిన 45 సంవత్సరాల పురుషుడు మృతదేహంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.