VZM: పూసపాటిరేగ మండలం పెదపతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీష్ (19)కు 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3,500 జరిమానాను గురువారం విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేసింది. 2023లో కేసు నమోదు కాగా ధర్యాప్తు అనంతరం శిక్ష ఖరారైందని ఎస్పీ దామోదర్ తెలిపారు.