NLR: అరుణ గన్తో బెదిరించి సెటిల్మెంట్కు పాల్పడిందన్న ఆరోపణలపై నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. అయితే ఆమె వాడిన గన్ ఎవరిది..? నిజంగానే తుపాకి వాడిందా లేక డమ్మీ గన్ వాడిందా అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆమె ఓ ఎస్సైతో సన్నిహితంగా ఉండేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.