సత్యసాయి: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో ర్యాలీ నిర్వహించారు. ఎనుములపల్లి PHC వద్ద ర్యాలీని MLA పల్లె సింధూరరెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరిన వైద్యులు, ఆశా వర్కర్లు గణేష్ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహా భాగ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.