ATP: గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి పామిడి మండలం జి కొట్టాల గ్రామంలో సుదర్శన్ రెడ్డి అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి అక్కడికి వెళ్లి మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు.