VZM: గుర్ల మండలంలో డయేరియా మళ్లీ పడగ విప్పింది. ఈ మండలాన్ని డయేరియా వీడడం లేదు. అధికారక లెక్కల ప్రకారం రెండు నెలల క్రితం డయేరియా బారిన పడి సుమారు 10 మంది మృత్యువాత పడ్డారు. మాజీ సీఎం జగన్, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ సైతం గుర్లలో పర్యటించి బాధితులను పరామర్శించారు. తాజాగా జమ్ము గ్రామంలో ఆరు కేసులు నమోదు కావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.