BPT: చీరాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్, మహిళా ఎస్సై వాణిశ్రీ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీ నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించిన వాహనదారులను ఎస్సై పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. క్రమశిక్షణతో వాహనాలు నడిపే వారిని ప్రోత్సహించడం ద్వారా ఇతరులలో మార్పు వస్తుందని అధికారులు పేర్కొన్నారు.