ATP: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు ఏఆర్ పోలీసులకు మన్నీల ఫైరింగ్ రేంజ్ మైదానంలో శుక్రవారం శిక్షణ నిర్వహించారు. ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఆయుధాల వినియోగం, లక్ష్య సాధనపై సిబ్బందికి ప్రాయోగిక సాధన చేయించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.