ప్రకాశం: నూతన మోటర్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు హెచ్చరించారు. గురువారం మండలంలోని వేములపాడు రోడ్డు నందు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఎస్సై చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.1000లు జరిమానా తప్పదని హెచ్చరించారు.