BPT: కొల్లూరులోని ఎంప్లాయిస్ రిక్రియేషన్ క్లబ్ నందు బుధవారం తెలుగుదేశం పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో సాగునీటి సంఘాలు, సొసైటీ ఎన్నికలు తదితర అంశాలపై ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు చర్చిస్తారని తెలిపారు. సమావేశంలో మండల పరిధిలోనే టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.