NLR: జిల్లాలోని ఆలయాల అభివృద్ధిపై దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయాల నిర్మాణం మొదలైన అంశాలపై చర్చించారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో కోట్లాది రూపాయలతో జరుగుతున్న పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు.