కడప జిల్లాలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ తప్పక ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 242 మందిపై కేసులు నమోదు చేసి, రూ.53,650 జరిమానా విధించినట్లు తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.