ప్రకాశం: గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న దాదాపు 250 కుటుంబాలకు ఒక్క నీటి బోరు కావడంతో రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కాళీ బిందెలతో తమ నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.