NDL: పల్నాడు జిల్లా పోతవరం సమీపంలో ఆటో ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఆ రూట్లో ప్రయాణిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘటనను గమనించి ప్రథమ చికిత్స అందించారు. అంబులెన్స్‌లో అతడిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చెప్పడంతో స్థానికులు ఆయన చర్యలను అభినందించారు.