AKP: అర్హులైన వారికి ప్రభుత్వం ఉచిత ఇళ్ల స్థలాలు మంజూరు చేయనుంది. రోలుగుంట తహసీల్దార్ నాగమ్మ ఇవాళ తెలిపారు. ఆసక్తి గల వారు ఆధార్, రేషన్ కార్డు, పాస్పోర్టు ఫోటోతో గ్రామ సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హుల గుర్తింపు కోసం సిబ్బంది ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించినట్లు తెలిపారు.