VSP: సీతమ్మధార ప్రకాష్రావుపేటలో బుధవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను గుర్తించి వెంటనే నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్లాప్ వాహనాలు సమయానికి రావాలని, పారిశుధ్య కార్మికులు ఉదయం 5:30కే పనులు ప్రారంభించాలన్నారు.