ప్రకాశం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేద్దామని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరిలో కుటుంబ సాధికార సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. కుటుంబ సాధికార కమిటీ సభ్యులు తమ పరిధిలోని ప్రతి 60 మందిలో సంక్షేమ పథకాలు ఇంకా అందని వారు ఉంటే వారిని గుర్తించి, పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలన్నారు.